ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విమర్శించారు. రైతులు, కౌలు రైతులకు 90 శాతం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూన్ 1న నందవరం మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నందవరంలో సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు.