గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామ సచివాలయంలో శుక్రవారం రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త భూహక్కు పట్టాదారు పాసుపుస్తకాలను ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, మండల రెవిన్యూ అధికారి రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. ఈ పాసుపుస్తకాలతో భూములపై రైతుల హక్కులు బలపడతాయని, భూ వివాదాలకు చెక్ పడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు పూజారి వేంకట సాయినాథ్, ఉపాధ్యక్షుడు దిడ్డికాటి అంపన్న తదితరులు పాల్గొన్నారు.