కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఒకే నెలలో రెండు పెన్షన్లు అందాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ కోపరేట్ టౌన్ బ్యాంకు డైరెక్టర్ కదిరికోట షాలేము, సూరి బూత్ కన్వీనర్లు శ్రీనివాసులు, వెంకటేశు, వీరేష్ పాల్గొన్నారు.