ఎమ్మిగనూరులో మూడో అంతస్తు నుంచి కిందపడి ఒకరు మృతి

ఎమ్మిగనూరులోని HBS కాలనీ బాలాజీ కన్‌స్ట్రక్షన్ భవనంలో పెయింటింగ్ పనులు చేస్తున్న పరమేశ్వర్ రెడ్డి (50) ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుడు మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందినవారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్