ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గురువారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు. విద్యార్థుల బంగార భవిష్యత్ కోసం కృషిచేస్తున్నారంటూ కొనియాడారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య, సీఐ శ్రీనివాసులు, మాచాని మహేష్ పాల్గొన్నారు.