ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి రాజీవ్ రెడ్డికి నిరసన సెగ

ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో 29వ రోజు నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలు ఆదివారం ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి రాజీవ్ రెడ్డిని అడ్డుకున్నారు. ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించడంలో ప్రజల మనోభావాలను విస్మరిస్తున్నారని, అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో తమ నిజస్వరూపాన్ని బయటపెడతామని జేఏసీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్