బోడబండ వద్ద రోడ్డు ప్రమాదం – ఇద్దరికి తీవ్ర గాయాలు

మంగళవారం ఎమ్మిగనూరు మండలంలోని బోడబండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవబెట్ట గ్రామానికి చెందిన మల్లికార్జున, రంగస్వామి అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు వెళ్తున్న వారి మోటార్‌సైకిల్‌ను మంత్రాలయం వైపు నుంచి వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్