విశ్వకర్మ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన ఎస్బీఐ మేనేజర్

కర్నూలు జిల్లా గోనెగండ్ల స్టేట్ బ్యాంక్ మేనేజర్ నరేష్ బాబు, పీఎం విశ్వకర్మ శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారికి చేదోడుగా ఉండేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని రుణాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్