సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి

ఎంతోమంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ అజీజ్ మియా(90) ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆయన గోనెగండ్ల, ఐరన్ బండ, చిన్నమరివీడు గ్రామాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి 1996లో ఉద్యోగ విరమణ పొందారు. అజీజ్ మియా శిష్యులు అనేకమంది గొప్పగొప్ప రంగాల్లో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల పూర్వ విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్