రఘు సెల్ వరల్డ్‌పై విజిలెన్స్ తనిఖీలకు విద్యార్థి సంఘాల డిమాండ్

ఎమ్మిగనూరులోని రఘు సెల్ వరల్డ్ యాజమాన్యంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని సమైక్య విద్యార్థి సంఘాల నాయకులు బి.మహేంద్ర బాబు, ఉదయ్, శేఖర్ నాయుడు ఆదివారం డిమాండ్ చేశారు. ప్రజలకు అధిక ధరలకు మొబైల్స్ అమ్ముతూ, జీఎస్టీ, ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను వంటి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నారని, కొనుగోలుదారుల నుంచి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనధికారికంగా ఉన్న మొబైల్స్ ను సీజ్ చేయాలని, దుకాణం ముందు వాహనాల పార్కింగ్ తో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నారని, దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్