కర్నూలు జిల్లా గోనెగండ్లలో, ఆయుష్మాన్ భారత్ పథకం కింద, రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. టిడిపి మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్రెడ్డి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మండలానికి 3 హెల్త్ క్లినిక్ లు మంజూరు చేశారని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు భూమిపూజ నిర్వహించామని తెలిపారు.