అమరావతి: "ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడం గర్వంగా ఉండేది, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ఏపీకి తీసుకొచ్చాం" అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పారిశ్రామిక కృషి వల్లనే ఈ అంతర్జాతీయ బ్రాండ్ రాష్ట్రానికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల వేలమంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ అభివృద్ధి జరిగిందని తెలిపారు.