మెగా డీఎస్సీపై నిరసనకు తరలిన ఎమ్మిగనూరు యువత

మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి యువత పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వైసీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ పిలుపు మేరకు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు డి. నజీర్ అహమ్మద్, మండల యువజన విభాగ అధ్యక్షుడు బనవాసి బసిరెడ్డి ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలని యువత డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్