ఎమ్మిగనూరు పట్టణంలో వైసిపి శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. వైసిపి ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్ కొనసాగుతోందని ఆరోపించారు. వైసిపిపై అసత్య ఆరోపణలు చేస్తూ, అనైతిక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు వాడారని వైసీపీపై నెట్టడం సరికాదని అన్నారు.