TG: సరికొత్త టెక్నాలజీ 'D2M'ను రాష్ట్రానికి తెచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ పితామహుడు కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో ఫీచర్ ఫోన్లు, ట్యాబ్ల తయారీ యూనిట్‌ను పెట్టాలని లోకేశ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. సింగిల్ విండో విధానంలో కంపెనీకి కావాల్సిన స్థలం, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.