జగన్‌ను కలిసిన లంకపల్లి రైతులు (వీడియో)

AP: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కృష్ణా జిల్లా లంకపల్లి రైతులు బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. 600 ఎకరాల లంక భూముల వ్యవహారంపై జగన్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై టీడీపీ నాయకులు, వారి బినామీల పేర్లతో అనధికారికంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన న్యాయ సహాయం పార్టీ నుంచి అందిస్తామని రైతులకు జగన్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕