AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలులో పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణమని మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. దాడులతో మనుషులను చంపుతారా అంటూ ప్రశ్నించారు.