AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పార్టీ కోసం నేతలు పనిచేయడం లేదంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ బలాలు, బలహీనతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు కాకినాడ పార్లమెంటరీ పరిధిలో 32 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వివిధ వర్గాలకు చెందిన జనసేన నేతలకు చోటు దక్కింది.