ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే నేతల టార్గెట్: గుడివాడ అమర్నాథ్

కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని YCP మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంగా ఏపీలో ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్