AP: ఏవియేషన్ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అగ్రగామి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం సరళ, గోల్డెన్, హరిబన్ ఏరోనాటిక్స్ సంస్థల ప్రతినిధులు మంత్రి జనార్దనరెడ్డిని కలిశారు. ఏపీకి వచ్చే సంస్థలకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఏపీలో రూ.500కోట్ల పెట్టుబడులకు డేటా సెంటర్ సీటీఆర్‌ఎల్ ఆసక్తి చూపుతున్నట్లు మంత్రికి తెలిపారు. హరిబన్ ఏరోనాటిక్స్ వైమానికి పరికరాలు తయారుచేయనుంది.