TG: మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో జర్మనీ భాషా శిక్షణ తరగతులను సందర్శించిన మంత్రి వివేక్, ఈ భాష నేర్చుకుంటే జర్మనీలో ఉద్యోగాలు గ్యారంటీ అని యువతకు హామీ ఇచ్చారు. జర్మనీ 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం BLA-2 లతో సమావేశమై ఓటరు నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు దోచుకున్నారని కేసీఆర్, హరీష్ రావులపై విమర్శలు గుప్పించారు.