AP: అల్లూరి జిల్లా పాడేరులో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఇరడాపల్లి పంచాయతీ లాడాపుట్టులో మత్స్యరాజు అనే ఉపాధ్యాయుడికి తన పొలంలో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. అటు వైపు వెళ్లి చూడగా చిరుతపులి కనిపించింది. సెల్ ఫోన్లో చిత్రీకరించి గ్రామస్థులకు సమాచారమిచ్చాడు. అటవీ శాఖ సిబ్బంది గ్రామాన్ని పరిశీలించి.. చిరుత పాదాల గుర్తులను పరిశీలిస్తున్నారు.