CCTV: అర్ధరాత్రి లెక్చరర్ ఇంట్లో దూరిన చిరుత పులి

AP: తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో అర్ధరాత్రి ఓ చిరుత సంచారం కలకలం సృష్టించింది. వెంకటాపురం లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి దూరిన చిరుత, ఇంట్లోని పెంపుడు జంతువులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇంటి యజమానులు కేకలు వేయడంతో చిరుత పరారైంది. ఈ చిరుత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చిరుతను బంధించాలని స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్