తిరుపతిలో చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు

AP: టెంపుల్ సిటీ తిరుపతిలో చిరుత సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవలే ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చిరుతలు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఐ బ్లాక్, జి బ్లాక్ మధ్యలో చిరుతను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్