AP: రాష్ట్రంలో పీ4 అమలుకు కూటమి ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది మార్గదర్శకులుగా ఉండేందుకు ముందుకొచ్చారు. వారిలో టాప్ 200 మందిని జులై 18న డిన్నర్‌లో సీఎం చంద్రబాబు కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని వెల్లడించారు.