‘పోర్టుకు పోదాం రండి’ కార్యక్రమం ఓ డ్రామా : దువ్వాడ శ్రీనివాస్‌

AP: 'మూలపేటకు పోదాం' సమావేశంపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. జగన్ ఆశయాలను ధర్మాన ప్రసాదరావు తుంగలో తొక్కారని ఆరోపించారు. పోర్టుకు వెళ్దామని పిలిచి లోపలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 40 మందికి అనుమతి ఉన్నా ధర్మాన ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. కింజరాపు, ధర్మాన కుటుంబాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని, భూసేకరణ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్