ఏపీని వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారుద్దాం అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రస్తుతం వర్చువల్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. ఈ తరహా ఇన్నోవేటివ్ పథకాన్ని తీసుకురావాలి. తద్వారా 5-10లక్షల మందికి ఉపాధి లభిస్తుంది
దేశంలో ఎవ్వరూ దీన్ని రూపొందించలేదు. దేశంలో ముఖ్యమైన 100మందిని పిలిచి ముందు వర్క్‌షాపు పెడదాం. అందరూ అమోదం తెలిపిన తర్వాత పాలసీ తయారు చేద్దాం‘ అని సీఎం అన్నారు.