కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ మృతి

AP: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను అన్నమయ్య జిల్లా తంతివారిపల్లికి చెందిన రఘుపతి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఖైదీ మృతిని పోలీసులు ధృవీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్