శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, తుంగభద్ర నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. 2 రోజుల్లో డ్యామ్ నిండే అవకాశం ఉండటంతో మంగళవారం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గేట్లు ఎత్తనున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగుల వరకు చేరుకుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి సీమకు నీళ్లు వదులుతున్నారు.