ఇవాళ ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕