AP: మార్కాపురం జిల్లా వెల్లంపల్లిలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఒక కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. మేడపి విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో స్తంభాల ఇన్సులేటర్లు కాలిపోవడంతో తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, మిర్చి పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు.