రాజ్యసభలో నలుగురు సభ్యులు జూన్ లో పదవీ విరమణ చేయనున్నారు. గతంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా, సమీకరణల దృష్ట్యా అది సాధ్యపడలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జనసేనకు రాజ్యసభ పదవి వస్తే, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సన్నిహితుడు. జనసేనలో రాజ్యసభ పదవి కోసం పోటీ లేకపోవడంతో ఆయన పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది.