AP: మందుబాబులకు షాక్. మరో రెండు నెలల్లో మద్యం దుకాణాల లీజు గడువు ముగియనుంది. దాంతో రాష్ట్రంలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూళ్లకు వైన్ షాపుల యజమానులు తెరలేపారు. ఒక్కో మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.30 వరకు వసూళ్లు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు, ప్రకాశం జిల్లాలో ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.