AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం(డిసెంబర్ 31) ఏపీలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజులో రూ.172 కోట్ల విలువ కలిగిన మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఈ విక్రయాల్లో 2,20,719 కేసుల మద్యం, 95,026 కేసుల బీరు విక్రయించినట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.60 కోట్ల కంటే ఎక్కువగా లిక్కర్ ప్రియులు మద్యం తాగారు.