లిక్కర్ స్కామ్: రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

AP: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2019 తర్వాత మద్యం విధానంలో మార్పులు చేసి, పాత లిక్కర్‌ బ్రాండ్లను తొలగించి, ఫేవర్ బ్రాండ్లకు స్పెషల్ ఆర్డర్లు ఇచ్చారని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం దాకా కిక్‌బ్యాక్ తీసుకున్నట్లు, కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు ఆపేసినట్లు విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్