లిక్కర్ స్కామ్.. కంటతడి పెట్టుకున్న రాజ్ కెసిరెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు రాజ్ కెసిరెడ్డిని సిట్ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా రాజ్ కెసిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ స్కామ్ డబ్బులేనని చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో దొరికిన రూ.11 కోట్లకు తనకు సంబంధం లేదని, ఆ నగదుపై నంబర్స్ రికార్డు చేయాలని న్యాయమూర్తిని కోరారు.

సంబంధిత పోస్ట్