AP: మార్కాపురం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సెంటర్‌లో బడి, గుడికి సమీపంలో ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ షాపుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ షాపులను తరలించాలని డిమాండ్ చేశారు.