AP: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి సమీపంలో లోడ్ లారీ, టిప్పర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ కేబిన్‌లో డ్రైవర్, క్లీనర్ చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీయడానికి పోలీసులు, సహాయక సిబ్బంది ప్రత్యేక పరికరాలతో సుమారు నాలుగు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా వచ్చిన వాహనాల ఢీతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.