AP: అక్టోబర్, నవంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. అప్పటివరకు ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి, సంక్షేమాలు అమలవుతాయన్నారు.