స్థానిక ఎన్నికలు.. పదవి కోసం పెళ్లి?

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఒక వివాహం రాజకీయ చర్చకు దారితీసింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి గుళ్ల మంజీరను వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. చైర్‌పర్సన్ పదవిని దృష్టిలో పెట్టుకునే ఈ వివాహం జరిగిందా అనే దానిపై స్థానికంగా చర్చ మొదలైంది. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమా లేక రాజకీయ వ్యూహమా అనేది ప్రస్తుతం సాలూరులో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕