AP: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమికి షాక్ తగిలింది. వైసీపీ కార్యాలయంలో, 46వ డివిజన్కు చెందిన సుమారు 200 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరారు. డివిజన్ ప్రెసిడెంట్ తుపాకుల గురుమూర్తి రెడ్డి, 46వ డివిజన్ అభ్యర్థి తుపాకుల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంపా రాజేష్, చిల్ల నాగరాజు, పూలవరపు మూర్తి వంటి నాయకులకు వెల్లంపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.