స్థానిక ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం ముందున్న సవాల్ ఇదే!

ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మార్చిలో పంచాయతీ ఎన్నికలకు పదవీకాలం ముగియనుంది. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడానికి కోర్టుల ఆదేశాలు, చట్టపరమైన పరిమితులను అధిగమించాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించే ఆలోచనలో ఉంది. వచ్చే మార్చితో వైసీపీ ప్రభుత్వంలో నియమించిన SEC నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. ఈలోపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఆమె పదవీ విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్