AP: ఒంగోలులో శనివారం నాడు ముగ్గురు మంత్రులు ఆనం, గొట్టిపాటి రవి కుమార్, బాలవీరాంజనేయస్వామి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నేతలతో సమావేశం కానున్నారు. ఒంగోలు మేయర్ అభ్యర్థితో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరగనున్నాయి. మంత్రి గొట్టిపాటి ట్రాన్స్కో ఆఫీసును కూడా ప్రారంభించనున్నారు. అలాగే, 5వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో కూడా మంత్రి పాల్గొంటారు.