AP: వైఎస్‌ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల వేళ ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత ఎన్. కిశోర్‌కుమార్‌రెడ్డి పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో, ఆయన భార్య ఎన్. పద్మజ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెండ్లిమర్రి స్థానం నుండి జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆమె కొత్త గంగిరెడ్డిపల్లె సర్పంచిగా కూడా పనిచేశారు.