AP: స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నెలలోనే జరుగుతాయని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఎన్నికలు జరగవనే అపోహలు ఎవరికీ వద్దని మంత్రులతో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడాలన్న వైసీపీ కుయుక్తులు పనిచేయవని, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలతో పొత్తుల అంశం సమన్వయ కమిటీ, అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.