స్థానిక ఎన్నికలు.. 3వ జాబితా రిలీజ్ చేసిన వైసీపీ

AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ తన 3వ జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22 మున్సిపాలిటీలు మరియు 10 నగర పంచాయతీలకు ఛైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా పిఠాపురం నుంచి రాజేశ్, నరసాపురం నుంచి రమాసీత, మార్కాపురం నుంచి కనకదుర్గ, చిలకలూరిపేట నుంచి షేక్ కరీమూన్, మాచర్ల నుంచి షేక్ సుల్తానా, రాయచోటి నుంచి జిన్నా షరీఫ్, ఆళ్లగడ్డ నుంచి షరీఫాబీ, తాడిపత్రి నుంచి ఫయాజ్ బాషా, నగరి నుంచి బాలకృష్ణన్ వంటి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕