AP: చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బుధవారం విజయవాడలో మాట్లాడుతూ 2017-2019 మధ్య ఈ పథకం ద్వారా 5 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని, సాధారణ మరణానికి 2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, అంగవైకల్యానికి 2.50 లక్షల నుండి 5 లక్షల వరకు పరిహారం లభించేదని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందని, ప్రస్తుతం పేదలు పాముకాటు, ప్రమాదాలు, పిడుగుపాటు వంటి వాటితో మరణిస్తే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పథకాన్ని పునఃప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.