జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది: మంత్రి లోకేశ్

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ బెంగళూరు పయనమవ్వడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉందని, వైసీపీ హయాంలో జరిగినట్లుగా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం వంటివి ఇప్పుడు లేవని, ప్రజలు సంతోషంగా ఉన్నారని లోకేష్ అన్నారు. రాత్రి ఆత్మ ఏం చెబితే ఉదయాన్నే జగన్ అదే మాట్లాడతాడని లోకేశ్ ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్