ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ఛైర్మన్‌తో లోకేష్‌ భేటీ

సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సైమన్ టాన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2029నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయ‌న‌కు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వోల్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ సైమ‌న్ టాన్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్