లోకేశ్ 'రెడ్ బుక్' పై అమెరికాలో చర్చ

AP: గత కొద్దిరోజులుగా పెద్దగా ప్రస్తావన లేని ‘రెడ్ బుక్’పై అమెరికాలోని డల్లాస్ వేదికపై పెద్ద చర్చ జరిగింది. రెడ్ బుక్‌లో రాసిన పేర్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ కొందరు అభిమానులు మంత్రి లోకేశ్‌ను ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో అభిమాని కొడాలి పేరు ప్రస్తావించారు. దీనికి స్పందించిన లోకేశ్ మాట్లాడుతూ.. పేర్లు ఎందుకు? మీకు ఎలాంటి డౌట్ వద్దు.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు... అంటూ తేల్చిచెప్పారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్